జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర (2)
మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లున పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర "జగడపు"
భారపు కుచముల పైపై కడు సింగారము నెరపడి గందపొడి
చేరువపతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర "జగడపు"
బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము
వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర "జగడపు"