అదివో అల్లదివో శ్రీ హరివాసము
పదివేల శేషుల పడగలమయము "అదివో"
అదె వేంకటాచల మకిలోన్నతము
అదివో బ్రహ్మదుల కపురూపము
అదివో నిత్య నివాస మకిలమునులకు
నదె చూడుడు అదె మొక్కు డానందమయము "అదివో"
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము "అదివో"
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వెంకట పతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావనమయము "అదివో"
పదివేల శేషుల పడగలమయము "అదివో"
అదె వేంకటాచల మకిలోన్నతము
అదివో బ్రహ్మదుల కపురూపము
అదివో నిత్య నివాస మకిలమునులకు
నదె చూడుడు అదె మొక్కు డానందమయము "అదివో"
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము "అదివో"
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వెంకట పతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావనమయము "అదివో"