పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత
పెడమరలి నవ్వీని పెండ్లికూతురు "పిడికిట"
పేరుగల జవరాలె పెండ్లికూతురు పెద్ద
పేరుల ముత్యాలమేడ పెండ్లికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు విభు
పేరుకుచ్చ సిగ్గువడి పెండ్లికూతురు "పిడికిట"
బిరుదు పెండెము పెట్టె పెండ్లికూతురు
నేర బిరుదు మగనికంటే పెండ్లికూతురు
పిరుదూరి నప్పుడే పెండ్లికూతురు పతి
బెరరేచి నిదివో పెండ్లికూతురు "పిడికిట"
పెట్టెనే పెద్దతురుము పెండ్లికూతురు నేడే
పెట్టెడు చీరలు గట్టె పెండ్లికూతురు
గట్టిగ వెంకటపతి కౌగిటను వడి
వెట్టిన నిధానమైన పెండ్లికూతురు "పిడికిట"
పెడమరలి నవ్వీని పెండ్లికూతురు "పిడికిట"
పేరుగల జవరాలె పెండ్లికూతురు పెద్ద
పేరుల ముత్యాలమేడ పెండ్లికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు విభు
పేరుకుచ్చ సిగ్గువడి పెండ్లికూతురు "పిడికిట"
బిరుదు పెండెము పెట్టె పెండ్లికూతురు
నేర బిరుదు మగనికంటే పెండ్లికూతురు
పిరుదూరి నప్పుడే పెండ్లికూతురు పతి
బెరరేచి నిదివో పెండ్లికూతురు "పిడికిట"
పెట్టెనే పెద్దతురుము పెండ్లికూతురు నేడే
పెట్టెడు చీరలు గట్టె పెండ్లికూతురు
గట్టిగ వెంకటపతి కౌగిటను వడి
వెట్టిన నిధానమైన పెండ్లికూతురు "పిడికిట"