Tirumala
అన్నమయ్య సంకీర్తనలు
"కొండలలో నెలకొన్న"
కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు "కొండలలో"
కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాంజక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు "కొండలలో"
అచ్చపు వేడుకతోడ ననంతాళువారికీ
ముచ్చలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిన దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు "కొండలలో"
కంచిలోననుండ దిరుక్కచ్చినండి మీద, కరు
ణించి తనయెడకు రప్పించినవాడు
యెంచి నెక్కుడైన వెంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు "కొండలలో"

"పిడికిట తలంబ్రాల"
పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత
పెడమరలి నవ్వీని పెండ్లికూతురు "పిడికిట"
పేరుగల జవరాలె పెండ్లికూతురు పెద్ద
పేరుల ముత్యాలమేడ పెండ్లికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు విభు
పేరుకుచ్చ సిగ్గువడి పెండ్లికూతురు "పిడికిట"
బిరుదు పెండెము పెట్టె పెండ్లికూతురు
నేర బిరుదు మగనికంటే పెండ్లికూతురు
పిరుదూరి నప్పుడే పెండ్లికూతురు పతి
బెరరేచి నిదివో పెండ్లికూతురు "పిడికిట"
పెట్టెనే పెద్దతురుము పెండ్లికూతురు నేడే
పెట్టెడు చీరలు గట్టె పెండ్లికూతురు
గట్టిగ వెంకటపతి కౌగిటను వడి
వెట్టిన నిధానమైన పెండ్లికూతురు "పిడికిట"

"అదివో.... అల్లదివో"
అదివో అల్లదివో శ్రీ హరివాసము
పదివేల శేషుల పడగలమయము "అదివో"
అదె వేంకటాచల మకిలోన్నతము
అదివో బ్రహ్మదుల కపురూపము
అదివో నిత్య నివాస మకిలమునులకు
నదె చూడుడు అదె మొక్కు డానందమయము "అదివో"
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము "అదివో"
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వెంకట పతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావనమయము "అదివో"
పదివేల శేషుల పడగలమయము "అదివో"
అదె వేంకటాచల మకిలోన్నతము
అదివో బ్రహ్మదుల కపురూపము
అదివో నిత్య నివాస మకిలమునులకు
నదె చూడుడు అదె మొక్కు డానందమయము "అదివో"
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము "అదివో"
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వెంకట పతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావనమయము "అదివో"
"జగడపు చనవుల జాజర"
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర (2)
మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లున పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర "జగడపు"
భారపు కుచముల పైపై కడు సింగారము నెరపడి గందపొడి
చేరువపతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర "జగడపు"
బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము
వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర "జగడపు"

"బ్రహ్మ కడిగిన పాదము"
బ్రహ్మ కడిగిన పాదమూ, బ్రహ్మము తానిని పాదమూ (2)
చలగివసుదగొనిచిన నీ పాదమూ, బలితలమోపిన పాదమూ,
తలకగగగనము తన్నిన పాదమూ, బలరిపుగాచిన పాదమూ,
" బ్రహ్మ"
కామినిపాపము కడిగిన పాదము, పాము తల నిడి న పాదము,
ప్రేమపు శ్రీ సతి పిసికేడి పాదము, పామేడి తురగపు పాదము
"బ్రహ్మ"
పరమయోగులకు పరి పరి విధముల వరమొసగేడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమనే, జూపిన పరమపదముని పాదము

"కస్తూరి రంగ రంగా" పాట
కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా!
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరుచుందురా!
"కస్తూరి"
కంసున్ని సంహరింప, సద్గురుడు అవతారమేత్తేనపుడు,
దేవకీ గర్బముననూ, క్రిష్ణావతరమై జన్మించెను.
ఏడురాత్రులు చేరిచీ, ఒక రాత్రి ఏక రాత్రిగ చేసేనూ,
ఆదివారము పూటనూ, అష్టమి దినమందు జన్మించెను!
తలతోనూ జన్మమైతే, తనకు బహు మోసంబు వచ్చుననుచూ,
ఎదురు కాళ్ళను బుట్టెనూ, ఏడుగురు దాదులను జాంపె నపుడు!
"కస్తూరి"
నెత్తురుతో ఉండి అపుడూ, ఆ బాల కావుకావున ఏడ్చేనూ,
నన్నేల ఎత్తుకొనవే, ఓ తల్లి దేవకీ వందనంబు.
ఒళ్లెల్ల హీనంబుతో, ఈరీతినున్నాను కన్నతండ్రి,
నిన్నెట్లు ఎత్తుకోoదూ, నీ వొక్క నిమిషంబు తాళరన్నా,
"కస్తూరి"
గంగనూ ప్రార్ధించెను, జలనిధుల గంగ తానుప్పొంగెను,
గంగానదిలో నప్పుడు, దేవకీ జలకంబులాడేనపుడు!
ఇకనైనా ఎత్తుకొనవే, నా తల్లి దేవకీ వందనంబు,
కాని బాలుని వలెనూ, నన్నిట్లు ఎడబాసి ఉండదగున?
"కస్తూరి"
నీ పుణ్యమాయే కొడకా, ఇంకొక్క నిమిషంబు తాళమనుచూ,
కామదేనువు నపుడు, దేవకీ కడగి ప్రార్ధించగాను!
పాలవర్షము కురిసెనూ, అప్పుడా బాలుపై చల్లగాను,
తడివస్త్రములు విదిచెనూ, దేవకీ పొడి వస్త్రములు కట్టెను!
"కస్తూరి"
పోత్తిల్లమీద నపుడు, బాలుండు చక్కగా పవళించేనూ,
తన రెండు హస్తములతో, దేవకీ తనయున్ని ఎత్తుకోనేనూ!
అడ్డాలపై వేసుక, ఆ బాల నందచందము జూచెనూ,
వసుదేవ పుత్రుడమ్మ, ఈ బిడ్డ వైకుంట వాసుడమ్మ!
"కస్తూరి"
నవనీత చోరుడమ్మ, ఈ బిడ్డ నందగోపాలుడమ్మ!
సితపత్ర నేత్రుడమ్మ, ఈ బిడ్డ శ్రీ రామచంద్రుడమ్మ!
శిరమున చింతామణి, నా తండ్రి నాలుకకు నక్షత్రము,
పండ్లనూ వరుసవేది, భుజమున శంకు చక్రములు గలవూ!
"కస్తూరి"
వీపున వింజామరం, నా తండ్రి బొడ్డున పారిజాతం,
అరికాళ్ళ పద్మములనూ, అన్నియు అమరేసు కన్నతండ్రి!
నీ రూపు, నీ చక్కనా, ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్ర్రాసి తండ్రి,
అన్నేకారి కడుపునా, ఓ అయ్యా ఏల జన్మిస్తివయ్య
"కస్తురి"
మాయన్న కంసరాజు, ఇప్పుడు వచ్చేవేళాయేరన్నా,
నిన్ను నే నెత్తుకొని, ఏ త్రోవ నే పోదుర కన్నతండ్రి!
ఆ చక్కదనము చూచి, దేవకీ శోకింపసాగే నప్పుడు,
తల్లి శోకము మాన్పుగా, మాధవుడు తంత్ర మొక్కటి చేసేను!
"కస్తూరి"
పెద్ద బొబ్బలు పెట్టుచూ, మాధవుడు గట్టిగ ఎడ్వసాగే,
శోకంబు చాలించుయూ, దేవకీ బాలుణ్ణి ఎత్తుకొనేను
నాయన్న ఊరుకోరా, నా తండ్రి గోపాలా పవళించరా!
అల్లడుగో బూచివాడు, నా తండ్రి వస్తాడు పవళించరా!
"కస్తూరి"
బూచులను మర్ధించనూ, నళినాక్షి బుద్దిమంతుడను అమ్మా,
బూచేమి జేసునమ్మ, నా తల్లి జోగి నన్నేరుగనమ్మ!
నీ పుణ్యమాయే కొడకా, నీ వొక్క, నిమిషంబు తాళమనుచూ,
అల్లడుగో జోగివాడు, నా తండ్రి వస్తాడు పవళించరా!
"కస్తూరి"
జోగి మందుల సంచులూ, ఏ వేళ నా చంక నుండగానూ,
జోగేమి చేసునమ్మ, నా తల్లి జోగి నన్నేరుగనమ్మ!
నీ పుణ్యమాయే కొడకా, నీ వొక్క నిమిషంబు తాళమనుచూ,
అల్లదుగో పామువచ్చే, నా తండ్రి గోపాల పవళించరా!
"కస్తూరి"
పాముల్ల రాజె అయినా, శేషుండు పాన్పుపై యుండగానూ,
పామేమి జేసునమ్మ?, నళినాక్షి భయము నీకేలనమ్మ!
నీలమేగపుచాయలు, నీమేను నీలాల హారములనూ,
సద్గురుడు వ్ర్రాసినాడు, నా తండ్రి నీ రూపు, నా చక్కనా!
"కస్తూరి"
నిన్ను నేనెత్తుకొని, ఏ త్రోవ పోదురా? కన్నతండ్రి!
నాకేమి భయము లేదే, నా తల్లి నాకేమి కొదువలేదే!
మా మామ కంసకుండు, ఈ వేళ నన్ను చంపగావచ్చినా,
మా మామ నా చేతనూ, మరణమై పోయేటి నిజము సుమ్మా!
"కస్తూరి"
వచ్చూ వేలయేననుచూ, నా తల్లి వసుదేవ పిలువనంపు,
గోపెమ్మ బిడ్డ నిపుడు, శ్రీగ్రముగా తెచ్చి నీవుంచావమ్మా!
అంతలో వసుదేవుడు, బాలుణ్ణి తలమీద ఎత్తుకొనేను,
రేపల్లె వాడలేను, గోపెమ్మ ఇంటనూ వచ్చేనపుడు!
"కస్తూరి"
గోపెమ్మ పుత్రి నపుడు, వసుదేవు భుజముపై నేక్కించుకు,
అతి త్వరితముగ వచ్చెనూ, దేవకీ హస్తములనుంచే నపుడు!
దేవకీ తనయుడపుడు, పుట్టేనని కంసునకు కబురాయెనూ!
జల్లుమని గుండె లదర, కంసుండు పీటంబు దుమికె నపుడు!
"కస్తూరి"
జాతకంబులు చూచెను, గండంబు తగిలెనని కంసుండు,
చంద్రాయుదము దూసుక, శ్రీగ్రముగా దేవకీ వద్ద కొచ్చే!
తెమ్మని సుతునడిగెను, దేవకీ అన్నది అన్నతోను,
మగవాడు కాదురన్న, ఈ పిల్ల ఆడపిల్ల నమ్మరా!
"కస్తూరి"
ఉపవాసములు నోములు, నోచి ఈ పుత్రికను గంటినన్న,
పుత్రి దానము చేయరా, నాయన్నా! పున్యవంతుడవురన్నా!
దేవాది దేవులైన, బ్రహ్మ రుద్రాదులను పూజచేసి,
పూజ ఫలముల చేతను, వారి క్రుపవల్ల పుత్రికను గంటి!
"కస్తూరి"
నీ పుణ్యమాయే రన్నా!, నీవు పుత్రికను దయచేయుమన్నా,
నిర్దయాత్మకుడవగుచు, నీ విట్లు చేయుట తగుదురన్నా!
ప్రేమతో చెల్లెలపుడు, అన్నను చేబట్టి బ్రతిమాలేను,
గంగాది నదులయందు, పుత్ర దానము చేయమని వేడేనూ!
కాదు కాదని కంసుడు, దేవకీ పుత్రికను అడిగేనపుడు,
అడ్డాలపై బాలను, పుచ్చుకొని ఎగరేసి నరకబోయే!
అంబరమునకు ఎగురగ, వేయునపుడా బాల కంసుజూచి,
నన్నేల జంపెదవురా?, నీ యబ్బ రేపల్లె వాడలోను?
"కస్తూరి"
పెరుగుతున్నాడు వినరా? క్రిష్ణవతరమై జన్మించేనూ,
నిజముగా దోచేనపుడు, కంసుండు ఏతెంచి పవళించెనూ!
రేపల్లె వాడలోను, పెరుగుతున్నాడని దిగులోందేను! నీ యబ్బ,
నీ తాతరా, కంసుడా! కృష్ణుండు పుట్టేననుచూ!
"కస్తూరి"
చల్లమ్ము వారలైనా, ఆ కబురు చక్కగా చెప్పగాను!
పుతకికి కబురాయెను, అపుడా పూతకి చేనుదేంచెను.
"కస్తూరి"
శ్రుంగారముగ పూతకి, స్తనములకు విషదార పూసుకొనెను,
రేపల్లె వాడలందు, కృష్ణుడు తిరుగుచున్న చోటుకు
చనుదెంచి విషపుపాలు, ఇవ్వగా సమకట్టి ఇవ్వగాను ,
బాలురతో బంతులాడ, కృష్ణుని బాలరందరు కొట్టగా!
"కస్తూరి"
కావుకావున ఏడ్చుచు, పరుగెత్తి వీధి నడుమను నిలిచెను!
ప్రేమ కృష్ణుణ్ణి జూచి పూతకి ప్రియముతో బుజ్జగించి!
నాయన్న ఊరుకోరా! నా తండ్రి ఇచ్చెదను రారా!
మూడు గుక్కలు తీర్చగా, పూతకి భూమిపై కోరిగిపడగా!
"కస్తూరి"
గోపెమ్మ జూచి అపుడు, బంగారుగిన్నెలో బువ్వపెట్టి,
ప్రొద్దున్న ఉగ్గుపోసి, కృష్ణుణ్ణి ఓడిలోను పండవేసే!
అంతలో కంస హితుడు, బండి రుపెదురుగా వచ్చి నిలిచే!
పాదములు పిడుగులవలే, అంతలో దడదడ విసిరే నపుడు!
"కస్తూరి"
వృషభమై వచ్చి నిలువ, ఒక్క , లగువున చంపివేసి నపుడు,
చల్లమ్మూ వారలైనా, ఈ కబురు చల్లగా చెప్పి రపుడు!
రేపల్లె వాడలోను, ఉన్నట్టి గోపికలు గుంపుగూడి,
మా ఇల్ల కోచ్చునమ్మా, కృష్ణుడు మము రవ్వ చేసునమ్మా!
"కస్తూరి"
తాళలేమమ్మ మేము, నీ సుతుడు తాలిమితో వుండడమ్మా!
ఇకనైన బుద్ది చెప్పి, ఇంటిలో పదిలమ్ము సేయుమమ్మా!
అనుచును గట్టిగాను, మనమంత గోపెమ్మా కడకు బోయి,
చెప్పుదామనుచు వారు, గోపెమ్మ చెంత కేగగ నప్పుడు!
"కస్తూరి"
గోపాల క్రిష్ణుడప్పుడు, అచటనే పాలు త్రాగుచు నుండెను,
ఇది ఏమి ఆశ్చర్యమే?, ఓ చెలియ ఇది ఏమి చోద్యమమ్మా?
కనుపాపలను దీసునే, కృష్ణుడు దొంగతనములు చేసునే!
ఇకనేమి చేసుకోను, మనము బులబాటమున వస్తినమ్మా!
"కస్తూరి"
అమ్మనే నేరుగనమ్మ, నా త్రోవ నేబోవుచుండగాను,
నను రవ్వ చేసిరమ్మా, నే నెంత భయపడి వస్తినమ్మా!
కొబ్బరి కుడకలనుచు, గోపికలు గొబ్బున పిలువబోవ,
కొబ్బరి కుడకలనుచు, గోపికలు గుబ్బలను చూపినారు!
"కస్తూరి"
పౌర్ణమి రోజులందు, జలజాక్షు లందరూ కూడగొని,
చీరలటు తీసివేసి, గోపికలు జలకమాడుచు నుండగా!
తీసివుంచిన చీరలు, కృష్ణుండు వేసే ఆ పొన్న మీద,
వేసియు వేణునాదం, వుదుచూ వుండే నా మాధవుండు!
"కస్తూరి"
జలకమ్ము చాలించిరి, గోపికలు మన చీరలేమాయనే,
నమ్మరాదే కృష్ణుణ్ణి, ఇకను ఈ చిన గొల్లవాని నెపుడు!
ఎంతపని చేసినమ్మా, ఓ చెలియ ఏమి ఆశ్చర్యమమ్మ!
వెదుకుచు కొందరుండి, నీళ్ళల్లో మునిగి యుండిరి కొందరు!
"కస్తూరి"
అప్పుడు గోపికలలో, ఓ ఇంతి తా జూచి శ్రీకృష్ణుని,
రారే ఓ అమ్మలారా! ఈ పొన్న మీదున్న శ్రీకృష్ణుని!
ఇవ్వరా మాచీరలు, ఓ కృష్ణ ఇవ్వరా మా రవికలు,
దండంబు పెట్టేదమురా, కృష్ణయ్యదయయుంచి దయచేయరా!
"కస్తూరి"
అందరూ ఒక చేతిలో, దండమ్ము పెట్టగా చూచి తాను,
పొందుగా మీరందరు, దండంబు రెండు చేతుల పెట్టరె!
ఎంత పని వచ్చే ననుచు, గోపికలు మానభంగము నొందిరి,
వసుదేవ తనయునకును, దండంబు రెండు చేతుల పెట్టిరి!
"కస్తూరి"
పొందుగా వలువలన్ని, కృష్ణుండు పేరు పేరున ఇచ్చెను,
నాయత్త తిట్టునేమో, యనుచు నోకరోకరితో వగచి రపుడు!
మా యాడుబిడ్డ యిపుడు, కొట్టునో నా బావ దండించునో,
నా మగడు బ్రతుకనీడు, ఓయమ్మ నేనేమి చేతునమ్మా!

Subscribe to:
Comments (Atom)